నల్గొండలో టిఆర్‌స్‌ శ్రేణుల సంబరాలు

trs
trs

నల్గొండ: నల్గొండ జిల్లా నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ నుండి పోటీ చేసిన తేరా చిన్నపరెడ్డి విజయం సాధించారు. చిన్నపరెడ్డికి 640 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థికి 414 ఓట్లు రాగా చిన్నపరెడ్డి 226 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. హాలియా, నిడమనూరులో టీఆర్‌ఎస్ శ్రేణులు టపాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. చింతపల్లి మండలంలో టీఆర్‌ఎస్ నాయకులు ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేశారు. చిట్యాలలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు స్వీట్లు పంచారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/