తెలంగాణ ముందంజలో టిఆర్ఎస్

హైదరాబాద్: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి ఫలితాల్లో టిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. టిఆర్ఎస్ అభ్యర్థులు సికింద్రాబాద్‌లో తలసాని సాయికిరణ్ యాదవ్, భువనగిరిలో బూర నర్సయ్యగౌడ్, వరంగల్‌లో పసునూరి దయాకర్, జహీరాబాద్‌లో బీబీ పాటిల్, ఖమ్మంలో నామా నాగేశ్వరరావు, పెద్దపల్లిలో నేతకాని వెంకటేశ్, మెదక్‌లో కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఆదిలాబాద్‌లో గోడం నగేశ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కరీంనగర్లో బండి సంజయ్( బిజెపి ), ఆదిలాబాద్‌లో సోయం బాపూరావు( బిజెపి ) చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (కాంగ్రెస్), హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీ(ఎంఐఎం) ముందంజలో ఉన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/