మునుగోడు సభ కోసం ఇంఛార్జిలను నియమించిన సీఎం కేసీఆర్

ఈ నెల 20 న మునుగోడు లో టిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు సభ కోసం ప్రాంతాలవారీగా ఇంఛార్జిలను నియమించారు.

మునుగోడు : మంత్రి జగదీష్ రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.
చౌటుప్పల్ మున్సిపాలిటీ : రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు.
చౌటుప్పల్ రూరల్ : హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.
మర్రిగూడ : భువనగిరి ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి.
నాంపల్లి : దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి.
చండూరు మున్సిపాలిటీ : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్ధి లింగయ్య.
చండూరు రూరల్ : నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, యాదాద్రి జిల్లా జెడ్పి చైర్మన్ సందీప్ రెడ్డి.
నారాయణపురం : తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత లను నియమించారు.

ఇక మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం తో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని టిఆర్ఎస్ , బిజెపి , కాంగ్రెస్ పార్టీ లు కసరత్తులు చేస్తున్నాయి. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి..ఈ నెల 21 న బిజెపి లో చేరి..బిజెపి నుండి బరిలో నిలువబోతున్నాడు. ఇక టిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల నుండి ఎవరు నిలబడతారనేది చూడాలి.