ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం

తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ప్రారంభమైంది. మరికాసేపట్లో జాతీయ పార్టీ (BRS) ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించనున్న నేపథ్యంలో స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ఏర్పాటు చేసారు. సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు పార్లమెంట్‌ సభ్యులు, జిల్లా పరిషత్‌ అధ్యక్షులు సహా 283 మంది కీలక ప్రతినిధులు భేటీకి హాజరయ్యారు. అలాగే సమావేశానికి పలు రాష్ట్రాల నేతలు సైతం హాజరయ్యారు.

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ద‌స‌రా పూజ‌ల అనంత‌రం క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి, ఇత‌ర నేత‌ల‌తో క‌లిసి భారీ కాన్వాయ్‌తో కేసీఆర్ పార్టీ తెలంగాణ ఆఫీసుకు చేరుకున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు తెలంగాణ భ‌వ‌న్ వ‌ద్ద పార్టీ శ్రేణులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సార్ విగ్ర‌హానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. సార్ విగ్ర‌హానికి పుష్పాంజ‌లి ఘ‌టించి స్మ‌రించుకున్నారు. తీర్మానానికి ఆమోదం తెలుపుతూ 283 మంది సభ్యులు ఆమోదముద్ర వేయనున్నారు. ఆ తర్వాత సంతకాలు సేకరించనున్నారు. తీర్మానం అనంతరం 1.19 గంటలకు కేసీఆర్‌ జాతీయ పార్టీపై కీలక ప్రకటన చేయనున్నారు.