దేశవ్యాప్తంగా జాతీయవాదం భావన

vinod kumar
vinod kumar

కరీంనగర్‌: ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పే అంతిమం అని కరీంనగర్‌ మాజీ ఎంపి, టిఆర్‌ఎస్‌ నాయకులు వినోద్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ ఎన్నికల్లో ఫలితాలు తారుమారు అయ్యాయి దీనికి గల కారణం జాతీయవాదమే అనిపిస్తుంది. మొదటిసారి ఓటు హక్కు వచ్చిన వారు అత్యధికులు బిజెపికే ఓటేశారు. దేశ వ్యాప్తంగా జాతీయవాదం భావన నడుస్తుంది. ఎన్నికల ముందు తీవ్రవాద స్థావరాలపై భారత్‌ చేసిన దాడి బిజెపికి ప్లస్‌ అయిందని, ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు చాలా ముఖ్యం. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నిస్తామని, ప్రజా సమస్యల కోసం పనిచేస్తానని అని వినోద్‌ తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/