ప్లీనరీ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి తెరాస చేసే డిమాండ్స్ ఇవే

తెరాస ప్లీనరీ హైదరాబాద్ లో అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఆరు వేల మంది ప్రతినిధులను ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ స్థాపించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ప్లీనరీకి చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేశారు. ప్లీనరీలో ఏడు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు.

ప్లీనరీ మీటింగ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లను చేస్తోంది.SC వర్గీకరణ, ST మైనారీటి రిజర్వేషన్ల పెంపుదల కోసం చేసిన అసెంబ్లీ తీర్మానాలను కేంద్రం ఆమోదించాలని.. సమైఖ్య స్ఫూర్తి నిలబెట్టాలని…విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తుంది. ఐటీఐఆర్ ,బయ్యారం లో ఉక్కు ప్యాక్టరి,వరంగల్ లో రైల్వే కోచ్ ప్యాక్టరి ఏర్పాటు చేయాలని.. కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్స్ లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేయనుంది.

కూలల వారిగా బీసీ జనాభా లెక్కలు సేకరించాలని పేర్కొంది. అసెంబ్లీ చేసిన తీర్మానం పై కేంద్రం నిర్ణయం తీసుకోవడం లేదని….కేంద్రం దిగి వచ్చే వరకు టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేసింది. బీసీ లకు కేంద్రం లో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.