విజయవాడ సెంట్రల్‌ నుంచి టిఆర్‌ఎస్‌ పోటీ?

TRS
TRS

విజయవాడ: టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు విజయవాడకు చెందిన కొణిజేటి ఆదినారాయణ తెలిపారు. ఆదినారాయణ తొలినుంచి కేసిఆర్‌కు వీరాభిమాని కావడంతో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించాలని ఇంద్రకీలాద్రి వద్ద 101 కొబ్బరికాయలతో మొక్కు తీర్చుకున్నారు. టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక మోకాళ్లపై ఇంద్రకీలాద్రి ఎక్కారు. తాజాగా ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అజిత్‌ సింగ్‌ నగర్‌కు చెందిన ఆదినారాయణ విజయవాడ సెంట్రల్‌ నుంచి పోటీ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని అధిష్టానానికి తెలిపానని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి కేటిఆర్‌ను తీసుకొస్తాననీ, తెలంగాణ ఎంపి అభ్యర్ధులతో పాటే తానూ కేసిఆర్‌ నుంచి బీఫారం తీసుకుంటానని ఆదినారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/latestnews-uadates/