కెటిఆర్ పుట్టినరోజు సందర్భంగా మెగా బ్లడ్ క్యాంప్
యూసుఫ్ గూడలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన టిఆర్ఎస్

హైదరాబాద్: నేడు మంత్రి కెటిఆర్ జన్మదినోత్సవం సందర్భంగా యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రక్తదానం చేశారు. ఈ క్యాంప్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ ఫసిఉద్దీన్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. కాగా కెటిఆర్ జన్మదినం సందర్భంగా ఆయనకు వివిధ రంగాలకు చెందిన పలువురు శుభాకాంక్షలు తెలిపారు. తమ యువనేత పుట్టినరోజును పురస్కరించుకుని టిఆర్ఎస్ శ్రేణులు పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/