అమెరికాలో టిఆర్‌ఎస్‌ విజయోత్సవాలు

TRS, Celebrations, America, NRI TRS, Columbus
TRS, Celebrations, America, NRI TRS, Columbus

అమెరికాలోని టిఆర్‌ఎస్‌ కెసిఆర్‌, అభిమానులు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఆపార్టీ ఎన్నారై విభాగం విజయోత్సవాలు ఘనంగా జరుపుకుంది. ఒహియా రాష్ట్రంలోని కొలంబస్‌లో జరిగిన కార్యక్రమానికి వివిధ నగరాల నుంచి భారీ ఎత్తున కేసీఆర్‌ అభిమానులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ముందుగా అమరవీరులను స్మరించుకొని, ప్రొఫెసర్‌ జయశంకర్‌కు నివాళి అర్పించారు. అనంతరం కేక్‌ కట్‌చేసి విజయోత్సవాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడ్వయిజరీ బోర్డు చైర్మన్‌ తన్నీరు మహేశ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు చేరాయని, ప్రజలు రాష్ట్రం భవిష్యత్‌ దృష్ట్యా మరోసారి సీఎంగా కేసీఆర్‌ ఉండాలనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ను గెలిపించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొలంబస్‌ ఇంచార్జి వేణు పామేర, మిడ్వెస్ట్‌ రీజినల్‌ ఇంచార్జి నవీన్‌ కానుగంటి, సెక్రటరీ నరసింహ నాగులవంచ, యువజన విభాగం డేవిడ్‌ విక్రమ్‌, నవీన్‌ గుడిపల్లి, అశోక్‌, ప్రమోద్‌ జంగమ పాల్గొన్నారు.