సిఎం దత్తత గ్రామంలో టిఆర్‌ఎస్‌ ఓటమి!

trs
trs

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ సత్తా చాటుతుండగా సిఎం కెసిఆర్‌ దత్తత గ్రామం కరీంనగర్‌ జిల్లా చినముల్కనూర్‌ లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. అక్కడ ఎంపీటీసీగా స్వతంత్ర అభ్యర్థి రాజేశం గెలుపొందారు. హైదరాబాద్‌ మినహా 32 జిల్లాల్లో ఈ ఎన్నికలు జరగ్గా.. అన్ని జిల్లాల్లోనూ కారు జోరు కొనసాగుతోంది. మొత్తం 5,659 ఎంపీటీసీ, 534 జడ్పీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలను పరిశీలిస్తే.. 3042 ఎంపీటీసీ, 44 జడ్పీటీసీ స్థానాల్లో టిఆర్‌ఎస్‌ కొనసాగుతుంది.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/