హైదరాబాద్ రాజకీయాలతో ఏం పని?

పవన్ కల్యాణ్ పై బాల్క సుమన్‌ తీవ్ర వ్యాఖ్యలు

Balka Suman
Balka Suman

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బిజెపికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వపన్ కల్యాణ్ పై టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో దేనికీ పనికి రాని వ్యక్తికి హైదరాబాద్ రాజకీయాలతో ఏం పనో అని బాల్క సుమన్ సెటైర్ వేశారు. ఏపిలో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్ ఒక్క చోట కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. ఈ రాజకీయాలు ఏంటో వారికే తెలియాలని అన్నారు. గ్రేటర్ ఎన్నికలకు టిఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల్లో 50 శాతానికి పైగా డిగ్రీ పూర్తి చేసిన వారేనని బాల్క సుమన్ చెప్పారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్… ఆయన హోదాకు తగ్గట్టు వ్యవహరించాలని అన్నారు. బిజెపి పాలిస్తున్న గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో ప్రజలు తెలుసుకోవాలని చెప్పారు. టిఆర్ఎస్ నేతలపై బిజెపి వ్యక్తిగత విమర్శలు చేస్తోందని… అవి మానేసి దమ్ముంటే అభివృద్ధిపై మాట్లాడాలని అన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/