ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ ఆస్ట్రియా శాఖ

TRS
TRS

టీఆర్‌ఎస్ ఆస్ట్రియా శాఖ ఆధ్వర్యంలో ఆస్ట్రియాలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారం అనంతరం టీఆర్‌ఎస్ ఆస్ట్రియా శాఖ అధ్యక్షుడు మేడిపల్లి వివేక్ మాట్లాడారు. తెలంగాణ ప్రజలంతా కారు గుర్తుకే ఓటు వేసి 16 ఎంపీ సీట్లను గెలిపించి ఢిల్లీలో తెలంగాణ గళాన్ని వినిపించాలని కోరారు. తమ బంధుమిత్రులకు ఫోన్లు చేసి కారు గుర్తుకు ఓటేయించాల్సిందిగా ఆస్ట్రియాలోని ఎన్నారైలను కోరామని మేడిపల్లి వివేక్ తెలిపారు. 

పసుపు బోర్డు కోసం ఎంపీ కవిత పార్లమెంట్‌లో పోరాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఏ నియోజకవర్గానికి సమకూర్చని నిధులు 15 వేల కోట్లను ఒక నిజామాబాద్ కోసమే ఎంపీ కవిత సమకూర్చారన్నారు. లోక్‌సభలో తెలంగాణ గళాన్ని వినిపించి, బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన కవితను గెలిపించాలని నిజామాబాద్ వాసులను మేడిపల్లి వివేక్ రెడ్డి కోరారు.