టీఆర్ఎస్, సీపీఐ భావజాలం ఒక్కటే

Hyderabad: టీఆర్ఎస్తో కలిసి పని చేయడానికి సీపీఐ సానుకూలంగా స్పందించిందని టీఆర్ఎస్ నేత కే కేశవరావు అన్నారు. సీపీఐ నేతలతో సమావేశం ముగిసిన అనంతరం కేశవరావు మాట్లాడారు. సీపీఐతో చర్చలు సానుకూలంగా జరిగాయన్నారు. యురేనియం ఆపాలని అడిగారు, పోడు భూముల అంశాన్ని సీపీఐ నేతలు కోరారని, రెండు అంశాలపై తాము కూడా సానుకూలంగా ఉన్నామని కేకే అన్నారు. రెవెన్యూ చట్టం మార్పులపై అభిప్రాయం తీసుకోవాలని సీపీఐ కోరిందన్నారు. సీపీఐ ప్రతిపాదనకు ఒకే చెప్పామన్నారు. టీఆర్ఎస్, సీపీఐ భావజాలం ఒక్కటేనన్నారు. ఎప్పటికైనా మా మిత్రులు సీపీఐ అనే భావనలో ఉన్నామన్నారు. అందర్నీ కలుపుకొని పోవాలనే ఆలోచనతోనే మద్దతు కోరామన్నారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/