అశోక్‌గెహ్లాట్‌పై రాహుల్‌ సీరియస్‌

rahul gandhi, ashok gehlot
rahul gandhi, ashok gehlot

న్యూఢిల్లీ: రాజస్థాన్‌ సియం అశోక్‌ గెహ్లాట్‌పై కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ గెహ్లాట్‌ కేవలం తన కుమారుడు వైభవ్‌ ప్రచారం కోసమే పనిచేశారని రాహుల్‌ సీరియస్‌ అవుతున్నారు. రాజస్థాన్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలైంది. ఐతే రాష్ట్ర వ్యాప్తంగా అశోక్‌ గెహ్లాట్‌ ప్రచారం చేపట్టకుండా..కేవలం కుమారుడి సీటుకే పరిమితం కావడం రాహుల్‌ను ఆవేశానికి గురిచేస్తున్నది. లోక్‌సభ పరాభవాన్ని తట్టుకోలేక కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమైన రాహుల్‌ను బుజ్జగించేందుకు మరోవైపు సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. సిడబ్లూసి సమావేశంలో అశోక్‌ గెహ్లాట్‌ తీరుపై రాహుల్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. జోధ్‌పూర్‌లో తన కుమారుడి ప్రచారం కోసమే గెహ్లాట్‌ సమయాన్ని వృధా చేశారని రాహుల్‌ విమర్శించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/