పూజా హగ్దే కు త్రివిక్రమ్ భారీ గిఫ్ట్..?

డీజే తో పూజా హగ్దే జతకమే మారిపోయింది. అంతకు ముందు వరుస ప్లాప్స్ తో ఐరెన్ లెగ్ అనిపించుకున్న పూజా..డీజే తర్వాత అమ్మడికి వరుస ఛాన్సులు వస్తున్నాయి. అతి తక్కువ టైంలోనే అమ్మడు అన్ని భాషల్లో బిజీ హీరోయిన్ అయ్యింది. కొంతమంది డైరెక్టర్స్ కు లక్కీ హీరోయిన్ గా మారింది. అలాంటి డైరెక్టర్స్ లలో త్రివిక్రమ్ ఒకరు. త్రివిక్రమ్ తెరకెక్కించిన అలా వైకుంఠపురం లో , అరవింద సమేత చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటించింది.

అంతే కాదు ప్రస్తుతం మహేష్ తో చేస్తున్న మూవీ లోను ఈమె హీరోయిన్. త్వరలో సెట్స్ పైకి రానున్న త్రివిక్రమ్ – బన్నీ కలయిక మూవీ లో కూడా ఈమెనే హీరోయిన్ ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటె..తాజాగా పూజా కు త్రివిక్రమ్ భారీ గిఫ్ట్ ఇచ్చాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతుంది. 2 కోట్ల రూపాయల విలువైన కారును గిఫ్ట్ గా ఇచ్చాడని చెపుతున్నారు. ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

ఇక మహేష్ – త్రివిక్రమ్ మూవీ విషయానికి వస్తే ..అతడు ,ఖలేజా మూవీస్ తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండడం తో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా, నాగ వంశీ నిర్మిస్తున్నారు.