మలేషియాలో కరోనా సోకి భారతీయుడి మృతి

indian dead in malaysia
indian dead in malaysia

కౌలాలంపూర్: చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి సోకి ఓ భారతీయుడు మరణించారు. భారతదేశంలోని త్రిపుర రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కరోనావైరస్ సోకి మలేషియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. త్రిపురలోని పూర్తాల్ రాజ్ నగర్ గ్రామానికి చెందిన మానీర్ హోస్సేన్ 2018వ సంవత్సరంలో ఓ రెస్టారెంట్ లో పనిచేసేందుకు మలేషియా వెళ్లారు. మలేషియాలో కరోనావైరస్ తో తన మనవడైన మానీర్ హోస్సేన్ మరణించాడని అక్కడి అధికారులు చెప్పారని తాత అబ్దుల్ రహీం చెప్పారు. 23 ఏళ్ల తన మనవడు రెండేళ్ల క్రితం మలేషియా వెళ్లి అక్కడ పనిచేస్తూ కరోనా వైరస్ సోకి మరణించాడని అతని తాత రహీం ఆవేదనగా చెప్పారు. తన మనవడి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని మృతుడి తాత కోరారు. చైనా దేశంలోని వూహాన్ నగరంలో ప్రబలిన కరోనా వైరస్ ఇప్పటికే 170 మందిని బలిగొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/