త్రిపుర ముఖ్యమంత్రి జనతా దర్బార్

Trupura: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించడం కోసం జనతా దర్బార్ నిర్వహించారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది తొలిసారిగా జరిగిన జనతా దర్బార్. రాష్ట్రంలోని ధలాయ్ జిల్లా చావ్మనులో ఆయన జనతా దర్బార్ నిర్వహించారు. ఈ జనతా దర్బార్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. అత్యధికులు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన తదితర పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రికి విన్నవించుకోగా, అతి కొద్దిమంది మాత్రమే ఉద్యోగాలు ఇప్పించాలని కోరారు. ప్రజల సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా దేబ్ మీడియాతో మాట్లాడుతూ అత్యధికులు మంచి రోడ్లు, స్కూల్లు, తాగు నీరు, విద్యుత్, నివాస గృహాలను డిమాండ్ చేశారని, కొద్దిమంది ఉద్యోగాలు ఇప్పించాలని, రుణాలు ఇప్పించాలని కోరారని చెప్పారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/