టీఎంసీ నేత కుందూ కాల్చివేత

Nirmal Kundu
Nirmal Kundu

హైదరాబాద్‌: కోల్‌కతాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత నిర్మల కుందూను మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌కపై వచ్చి కుందూను కాల్చి చంపారు. ఈ ఘ‌ట‌న సీసీటీవీ కెమెరాకు చిక్కింది. ఓ టీ స్టాల్ ద‌గ్గ‌ర స్థానికుల‌తో మాట్లాడుతున్న‌ప్పుడు.. బైక్‌పై వెనుక కూర్చున్న వ్య‌క్తి టీఎంసీ నేత‌ను షూట్ చేశాడు. కాల్చిన వెంట‌నే బైక్‌పై వ‌చ్చిన ఇద్ద‌రు జ‌నం మ‌ధ్య నుంచి ప‌రార‌య్యారు. హాస్ప‌ట‌ల్‌కు తీసుకువెళ్తున్న స‌మ‌యంలో టీఎంసీ నేత ప్రాణాలు విడిచాడు. ఈ సందర్భంగా బెంగాల్‌ సిఎం మ‌మ‌తా బెన‌ర్జీ గురువారం కుందూ ఇంటికి వెళ్ల‌నున్నారు. అయితే బిజెపి నేత‌లే కుందూను చంపిచారంటూ టీఎంసీ ఆరోపిస్తున్న‌ది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/