ప్రధాని నెహ్రూకు ప్రముఖుల నివాళి

Sonia Gandhi, Rahul Gandhi ,manmohan singh
Sonia Gandhi, Rahul Gandhi ,manmohan singh

న్యూఢిల్లీ: ఈరోజు భారతదేశ తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ 55వ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోడి, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు పలువురు నాయకులు నివాళులర్పించారు. ఢిల్లీలోని శాంతివనంలో నెహ్రూ సమాధి వద్ద పలువురు ప్రముఖులు పుష్ఫగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఖఖపడింట్ జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను. దేశానికి ఆయన అందించిన సేవల్ని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారుగగ అని ప్రధాని మోడి ట్వీట్‌ చేశారు.మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీతో పాటు పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు శాంతివనంలో నెహ్రూకి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/