ఏకపక్ష నిర్ణయాలతో అంతా అగమ్యగోచరం

Tribal Ladiies (file)
Tribal Ladiies (file)

ఏకపక్ష నిర్ణయాలతో అంతా అగమ్యగోచరం

హిందూ వారసత్వపు యాక్టు 1986 హిందూ ఉమ్మడి కుటుంబాలలో మహిళా కాపర్లకు సమాన ఆస్తి హక్కు ఉండాలనే చట్టం ఏర్పడింది. దీంతో భూమిని కొని గిరిజనుల కు ఇవ్వటం జరిగింది. ఎపిఎఫ్‌డి 2009 ప్రకారం ఆంధ్ర ప్రదేశ్‌లో 63,814 చదరపు కిలోమీటర్లు అంటే 23.2% భౌగోళికంగాను, 50,478.63 అడవిగాను, 969.76 (1.52%) చదరపు కిలోమీటర్లు గుర్తించనిదిగా ఉంది. పూర్తి గిరిజన జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌ నగర్‌లలో 66% షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో 2011 జనగణన ప్రకారం 60%అనగా 59.18లక్షల మంది పూర్తిగా అడవి ఫలాలపైన, గనులపైన ఆధారపడి ఉన్నారు.

1954లో 1600 ఎకరాలు రొంపేరు డ్రైస్‌కింద మొట్టమొదట భూమిలేని నిరుపేదలకు ప్రగడ కోటయ్య సారధ్యంలో ప్రభుత్వ భూమిని పంచిపెట్టింది వాస్తవ ఉదాహరణ. కాని 1959లో ఎపిఎస్‌ఎ ఎల్‌టిఆర్‌ చట్టం ద్వారా తెగలు కాని వారికి మార్చుకోకుండా చట్టం చేసారు. ఎపిఎస్‌ఎఆర్‌ఎస్‌ఆర్‌ 1970 ప్రకారం రైతు వారి మార్పులు చేసుకునేందుకు వీలు కల్పించాయి. పేసా యాక్టు 1996 ప్రకారం సర్వహక్కులు ఉండేటట్లుగా గుర్తింపు నిచ్చింది. సొంత భూమి వారసత్వతో సంక్రమించిన వ్యవసాయ భూమి, ఇల్లు వగైరాలలో, వ్యవసాయం చేయలేని స్థితిలో ఉన్నవారు లీజుకు మూడవవారికి ఇవ్వవచ్చు. తాత్కా లికంగా లీజు తీసుకున్న వారి పేర్లు భూరికార్డులలో ఉండవ్ఞ. అందువల్ల వారికి పంట రుణాలు, రుణాల పరిత్యాగం, పంట బీమా, ప్రకృతి వైఫల్య నష్టాలు వాటి వల్ల ఎంతో నష్టపో యిన వాస్తవాలను గ్రహించిన ప్రభుత్వాలు వారి ప్రయోజ నాల దృష్ట్యా టెనెంటు చట్టంలో ఎన్నో మార్పులు చేసింది.

కెకెఆర్‌ కమిటీ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ పనివారి సంఘం) సర్వేప్రకారం వందశాతం నిజజీవితంలో బాగా బాధపడుతున్న వారికి చేయూతనిచ్చేందుకు తెలంగాణ, ఆంధ్రప్రాంత టెనెంట్లు ”లైసెన్స్‌డే కల్టివేషన్‌ యాక్ట్‌ 2011 వల్ల 4.23 లక్షల వారికి వసతులన్నీ ప్రభుత్వాలు కల్పించాయి. కాని వాస్తవానికి అవి ఆచరణలో రైతు, టెనెంట్ల మధ్య ఎన్నో అవరోధాలతో అస్తవ్య స్తమయ్యాయి. భూమి పంచే విషయాలలో సిజెఎఫ్‌ఎస్‌ మొదటి నుండి ప్రముఖపాత్ర వహించింది. ఇక గృహాలు అన్న విషయానికొస్తే అవసరమైన చోట స్థలం లేకున్నా ప్రభుత్వం కొనుగోలు చేసి ఇల్లులేని నిరు పేదలకు పంచటంలో ఎన్నో విడతలు జరుగుతూనే ఉన్నాయి. తరువాత స్థలాలకు సబ్సిడీలిచ్చి ప్రాంతాల వారిగా గృహాలను ప్రభుత్వం మంజూరు చేస్తున్నాయి. ఇక ఇల్లు, ఇళ్ల స్థలాల విషయా ని కొస్తే దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికి ప్రభుత్వం అందిం చిన ఇళ్లల్లో వారు జీవిస్తున్నారు.

నిజమైన లబ్దిదారులను గుర్తించటం అన్నది జరుగని పని. ఈ మారుతున్న కాలానికి పాలిస్తున్న పాలకులు తీసుకున్న నిర్ణయాలలో ”ప్రొహిబిటెడ్‌ అన్న నినాదం తీవ్రమైనది. ఉన్నత స్థాయిలో ఉన్న అధికా రులు, పాలకులు వాస్తవ పరిస్థితులను పరిగణలోనికి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాల వల్ల ఎన్నో లక్షలమందికి జీవనగమ్యం అగమ్యగోచరమై, మనం పక్కా ఇళ్లలో ఉన్నా మా? లేక అనాధ విడుదులల్లో ఉన్నామా అని వాపోతున్నా రు. టెనెంట్లకు ఇచ్చిన వరాలు, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తిస్తే లబ్దిదారులందరూ సంపన్నులు కారు. సేజ్‌ల కిచ్చిన భూములు పరిశ్రమలకిచ్చిన అధికారాలు దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికి లేవా? ఇప్పటి వరకు ఏ భూమి ఎవరికి చ్చారో రికార్డులు రెవెన్యూ డిపార్ట్‌మెంట్లో ఉన్నాయా? అస లు స్కీం వారీగా ఫైళ్లు ఉన్నాయా? వాటిని నిజమైన దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికే ఇచ్చారా? వాటిలో లబ్దిదారులుగా సంపన్నులు లేరా? చట్టప్రకారం లేఅవ్ఞట్‌ వేసినప్పుడు సదరు అప్రూవ్డ్‌ ప్లాన్లు ఆ లేఅవ్ఞట్‌ప్రదేశంలో ప్రదర్శనలో పెట్టాలి. ప్రభుత్వం ఎందుకు దీనిని విస్మరిస్తుంది.

– పాలెపు సుఖదేవయ్య