రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌కు డబ్లూఎఫ్‌ఐ షాక్‌!

ట్రయల్స్‌ వాయిదా వేయడం కుదరదు

Sushil Kumar
Sushil Kumar

న్యూఢిల్లీ: గాయంతో బాధపడుతున్న భారత రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ తన 74 కేజీల ఫ్రీ స్టైల్‌ విభాగంలో నిర్వహించే ట్రయల్స్‌ వాయిదా వేయాలని కోరాడు. అయితే ట్రయల్స్‌ను వాయిదా వేయడం కుదరదని భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) తేల్చిచెప్పింది. ట్రయల్స్‌లోని విజేతలు ఈ నెలలో రోమ్‌ వేదికగా జరగనున్న ఫస్ట్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌ టోర్నికి, ఫిబ్రవరిలో ఢిల్లీ వేదికగా జరగనున్న ఆసియా ఛాంపియన్‌షిప్‌కు, మార్చిలో చైనాలో జరగనున్న ఆసియా ఒలంపిక్స్‌ క్వాలిఫయిర్‌కు అర్హత సాధిస్తారు. కాగా ట్రయల్స్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా వేయలేం. 74 కేజీల విభాగంలో పోటీ పడటానికి ఎంతో మంది క్రీడాకారులు సిద్ధంగా ఉన్నారు. సుశీల్‌ గాయపడితే మేం ఏం చేయగలం. ట్రయల్స్‌లో నిలిచిన విజేత ఫస్ట్‌ ర్యాకింగ్‌ సిరీస్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో పరిశీలిస్తాం. ఈ తర్వాత నిర్ణయం తీసుకుంటామని డబ్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు భూషణ్‌ శరణ్‌ తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చయండి:https://www.vaartha.com/news/business/