నిర్భయ దోషులపై నేడు కోర్టులో విచారణ
పాటియాలా కోర్టులో నిర్భయ తల్లి పిటిషన్

న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులు పవన్ గుప్తా, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌లు నలుగురికీ వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలంటూ నిర్భయ తల్లి నేడు పాటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించనున్నారు. మరణశిక్షకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో దోషులకు వ్యతిరేకంగా డెత్ వారెంట్లు జారీ చేయడంపై నేడు పాటియాలా హౌస్ కోర్టు విచారణ జరపనుంది. దీంతో కోర్టును ఆశ్రయించిన నిర్భయ తల్లి దోషులకు త్వరగా ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టును అభ్యర్థించనున్నారు. నిర్భయ కేసులో ఒక్కరే ప్రత్యక్ష సాక్షి ఉన్నారంటూ దోషి పవన్ గుప్తా తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు నిన్న కొట్టివేసింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/