మానవజాతి మనుగడకు తొలిమెట్టు-చెట్టు

TREES

మానవాళికి స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అందించ డంతోపాటు భూగర్భజలాల సం రక్షణ, భూమికోత, కర్బన ఉద్గారాల తగ్గింపు, వాతావరణ మార్పుల నియంత్రణలో మొక్క(అడవ్ఞల)పాత్ర కీలకమని భావించారు.అలా ముందు చూపుతో మనదేశపు భూభాగంలో 33శాతం మేర అటవీ విస్తీర్ణాన్ని నిర్దేశించారు. ఆ లక్ష్యాలు దశాబ్దాలు దాటినా చేరుకోలేకపోతు న్నాం. కేంద్రం రాష్ట్రాలకు నిధుల విడుదలలో నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తుంది. మరోపక్క పెరుగుతున్న జనాభా, పర్యావరణ, వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి మనదేశ భూభాగంలో మున్ముందు 50 శాతం మొక్కల పెంపకం చేయాల్సి ఉందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ఐదేళ్లు పూర్తి అయింది. ప్రతిఏటా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించుకున్న ప్పటికీ 2015-16 నుండి 2019-2020 నాటికి అడవి బయట, లోపల కలిపి 177 కోట్ల మొక్కలు నాటినట్లు అధికారుల గణాం కాలు తెలుపుతున్నాయి.

ఇందుకుగాను రూ. 3,836 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఈ పథకంపై సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యానికి, సిబ్బంది అలసత్వం జతకలిసి క్షేత్రస్థాయిలో ఆశించినంతంగా ఫలితం కానరాకపోవడమే కాదు కదా నాటిన మొక్కల్లో మూడింట రెండువంతులకుపైగా ఎండిపోయినట్లు తెలుస్తుంది. క్రమం తప్ప కుండా నీళ్లుపోయడం, పశువ్ఞలనుంచి రక్షణ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం మూలంగా పచ్చదనం పథకంలో ఆశించినంతంగా ఫలితాలు కన్పించడం లేదు. ఎన్ని మొక్కలు బతికాయన్న దానిపై స్పష్టమైన గణాంకాలు అధికారుల వద్ద లేవ్ఞ. పంపిణీ చేసిన మొక్కలు, నాటిన మొక్కలు, క్షేత్రస్థాయిలో కనిపించే మొక్కలకు చాలా అంతరం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

ప్రజలు స్పందించిన చోట్ల స్థానిక సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టిన కొన్ని పట్టణ, గ్రామాల్లో మాత్రం ఆశించినంతగా పచ్చదనంతో చెట్లు పెరుగుతున్నాయి. ప్రత్యేకంగా గ్రామ పంచాయతీల్లో దృష్టి పెడుతున్న కారణంగా గతనాలుగేళ్లతో పోలిస్తే, ఐదో విడత హరితహారం మెరుగ్గా ఉంది. ముఖ్యమంత్రి అధికారుల, ప్రజా ప్రతినిధులపై కఠినంగా శాసనసభ వేదికగా మాట్లాడటం వలన కొంత మెరుగైంది. కానీ రైతులు ఎక్కువగా కోరుకునే టేకు, ఎర్ర చందనం లాంటి మొక్కల పంపిణీ జరగడం లేదు. ఇంటింటికి ఇచ్చే మొక్కలు ప్రజలు కోరుకునేవి కాకుండా నర్సరీలో ఉన్న వాటిని ఇవ్వడం జరుగుతుంది. హరితహారం పథకం గత ఐదేళ్లుగా పరిశీలిస్తే నాటుతున్న మొక్కల సంఖ్యతో క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నవి చూస్తే ఆశించిన లక్ష్యానికి చేరుకోలేకపోతున్నాయని, పచ్చదనం తగ్గిపోతుందని పాలకులు, ప్రజలు బెంగపడుతున్నారు.

ఇదిలా ఉంటే నిర్వహణ సమస్యలతోపాటు నాటుతున్న మొక్కలు ఉంటే మొక్కలను పర్యవేక్షించడం అధికారులకు, సిబ్బందికి సవాల్‌గా మారుతుంది. 2019-2020 సంవత్సరంలో మొదట 100 కోట్ల మొక్కలు నాటాలని నిర్దేశించుకుంటే 2019లో 37 కోట్ల మొక్కలు నాటినట్లు తెలుస్తుంది. ఒక గుడి కడితే హిందువ్ఞ లు వెళతారు, ఒక మసీదు కడితే ముస్లింలు వెళతారు, ఒక చర్చి కడితే క్రైస్తవ్ఞలు వెళతారు. అదే ఒక్క మొక్కనాటి వృక్షాన్ని చేస్తే దాని నీడలోకి కుల, మత, జాతి, బేధాలు లేకుండా సకల జీవజాతులతోపాటు మనుషులందరూ దాని నీడలోకి వెళతారు. ఆధునిక నాగరికత పేరుతో అడవ్ఞలను నరికివేసి పరిశ్రమల స్థాపన చేస్తున్నారు.

దానివల్ల ఆక్సిజన్‌ అందించే అడవ్ఞలు విషవాయువ్ఞలకు నిలయంగా మారిపోతున్నాయి. అంతేకాదు పట్టణాల, నగరాల, మహానగరాల విస్తరణతో అభివృద్ధి మాటున చెట్లను నరికివేస్తూ భూమి కనిపించకుండా చేస్తూ, చెట్లు లేని కాంక్రిట్‌ జంగల్‌గా మారుస్తున్నారు. హరితహారం హోరులో ఇప్పుడిప్పుడే అక్కడక్కడ మొక్కలు నాటుతున్నప్పటికీ, పెరిగిపోతున్న జనాభా, అందమైన ఆకాశహర్మ్యాల భ్రమలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉత్పత్తులు పెరిగిపోనున్నాయి. అంతేస్థాయిలో మొక్కలు నాటలేక నాటిన మొక్కలకు సంరక్షణ లేక, ఆశించిన స్థాయిలో మొక్కల పెంపకం జరగడం లేదు. కుటుంబంలో చంటిపిల్లలను చూసుకున్నట్లు సామాజిక బాధ్యతతో మొక్కలను నాటాలి.

నీరు పోసి పెంచాలి. రక్షణగా కంచెలు వేయాలి. తరగిపోతున్న అడవ్ఞల రక్షణతోపాటు, ఎక్కువ విస్తీర్ణంలో బాగా అడవ్ఞల పెంపకం జరగాలి. అలా దట్టమైన అడవ్ఞలు, వృక్షాలతో దండిగా వర్షాలు కురవడంతో కరవ్ఞ తరమివేయబడుతుంది. స్వచ్ఛమైన ప్రాణవాయువ్ఞతో, ఆయురారోగ్యంతో సుభిక్షంగా సమాజం భాసిల్లుతుంది. చెట్లు నరకడం మానాలి. లేదంటే కాలుష్యం కోరల్లో సకల జీవరాసులు చిక్కుకుంటాయి. పర్యావర ణాన్ని పదిలంగా రక్షించుకుంటూ ముందు తరాలకు భద్రంగా అందించాలని ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పరచి, వివిధ రకాల మొక్కలు నీడనిచ్చే పండ్లు, పూలు, ఔషధాల మొక్కల లాంటివి పెంచుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం పచ్చ దనంతో వెల్లివిరిసేలా ముఖ్యమంత్రి కలలుగన్న హరిత తెలంగాణ ఏర్పాటులో లోపాల ను సవరించుకొని రాజకీయాలకు అతీతంగా అందరు చేతులు కలపాలి. పచ్చదనంతో జగతిలో ఘనకీర్తిని చాటాలి. నిర్లక్ష్యాన్ని వీడాలి. దండుగా కదిలి, ఉద్యమంగా సాగాలి. నాటిన మొక్కలను జియోట్యాగింగ్‌ చేసి సంరక్షించాలి. మానవాళి బతుకుల్లో పచ్చదనం, చల్లదనంతో శోభాయమానంగా విరాజిల్లబడాలి. ఉద్గారాల నియంత్రణలో మొక్కల పెంపకం మాత్రమే ప్రధాన మార్గం. చెట్లను నరకడమంటే తన వేలుతో తన కన్ను పొడుచుకున్నట్లేనని మరువరాదు. సకల జీవకోటికి ప్రాణవాయువ్ఞ స్వచ్ఛమైనదిగా అందేటట్లు చూడాలి, చెట్లు పెంచాలి.

–మేకిరి దామోదర్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/