ఆర్టీసీకి రూ.3,380 కోట్ల అప్పులున్నాయి

N.V. Surendra Babu
N.V. Surendra Babu

విజయవాడ: ఏపి ఆర్టీసి ఎండీ సురేంద్రబాబు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతు..డీజిల్ ధరలు పెరగడం వల్ల ఏడాదికి రూ.650 కోట్లు భరించాల్సి వస్తోందని ఆయన అన్నారు. 201516 ఆర్థిక సంవత్సరంలో సంస్థకు రూ.735 కోట్లు నష్టం ఏర్పడిందని, 201617లో ఇది రూ.789 కోట్లకు చేరిందని తెలిపారు. 201718లో రూ1205 కోట్ల మేర ఆర్టీసీ నష్టపోయిందని సురేంద్రబాబు వివరించారు. ఈ ఏడాది పీఆర్సీ, డీజిల్‌ ధరల ప్రభావం ఉన్నప్పటికీ నిబద్ధతతో పని చేసి నష్టాన్ని తగ్గించామని వివరించారు. రుణాల రూపేణా ఆర్టీసీకి రూ.3,380 కోట్ల అప్పులున్నాయని సురేంద్రబాబు అన్నారు. విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ. 20 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉందని, ఉద్యోగుల భవిష్యనిధి పేరిట 671 కోట్లు జమచేయాల్సి ఉందని వెల్లడించారు. ఇతరత్రా బకాయిలన్నీ కలిపి ఆర్టీసీ రూ. 6500 కోట్ల మేర చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. పన్ను రూపంలో రూ.316 కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/