భారత్ సహా ఐదు దేశాలపై ఆంక్షలు ఎత్తేసిన జర్మనీ

బెర్లిన్ : కరోనా వల్ల వివిధ దేశాల మధ్య రాకపోకలు కూడా బంద్ అయిన సంగతి తెలిసిందే. భారత్ పై కూడా అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. తాజాగా కరోనా తీవ్రత తగ్గిన నేపథ్యంలో జర్మనీ క్రమంగా ఇతర దేశాలపై ఆంక్షలు ఎత్తేస్తోంది. ఈ దేశాల్లో భారత్ సహా ఐదు దేశాలు ఉన్నాయి. భారత్‌ సహా నేపాల్‌, రష్యా, పోర్చుగల్‌, యూకేను ‘హై ఇన్సిడెంట్‌ ఏరియాలు’గా పునర్వర్గీకరించనున్నట్లు రాబర్ట్‌ కోచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్‌కేఐ) సోమవారం తెలిపింది. డెల్టా వేరియంట్ తో ప్రభావితమైన ఐదు దేశాల ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు భారత్ లో జర్మనీ రాయబారి వాల్టర్ జె. లిండ్నర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జర్మనీ ప్రజలే కాకుండా ఈ దేశాలకు చెందిన ప్రజలు కూడా దేశంలో ప్రవేశించవచ్చని చెప్పారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/