విచిత్రమైన చేప.. రెండు నోర్లు

two-mouth-fish
two-mouth-fish

ఇది రెండు నోళ్లు ఉన్న చేప. దీన్ని చూసి ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.జన్యులోపాల పరంగా అదనపు కాళ్లు, చేతులు, రెండు తలలు… ఇలా లోపాలతో పుట్టిన ఎంతో మందిని, ఎన్నో జంతువులను మనం చూశాం. కానీ, ఇది అంతకన్నా విచిత్రమైన విషయం. ఓ చేపకు రెండు నోర్లు ఉన్నాయి. ఈ ఫోటోను షేర్ చేయగానే అది నిమిషాల్లో 6 వేలకు పైగా షేర్లను, వేల సంఖ్యలో కామెంట్లనూ తెచ్చుకుంది. ఇదో ఆశ్చర్యకరమైన జీవని, చాంప్లెయిన్ సరస్సులో పెరిగి ఉండవచ్చని, ఈ చేపను పట్టిన డెబియీ జీడీసెస్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఆయన వేట నిమిత్తం సరస్సుకు వెళ్లినప్పుడు ఇది వలకు చిక్కింది. దీన్ని చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఈ చేపకు రెండు తలలు ఉన్నాయి. నాలుగు కళ్లు లేవుగానీ, రెండు నోర్లు ఉన్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/