భారీ మంచు తుఫాన్.. 22 మంది పర్యాటకుల మృతి

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ముర్రేలో 22 మంది పర్యాటకులు మృతిచెందారు. భారీ హిమపాతం కారణంగా పర్యాటకుల వాహనాలు మంచులో కూరుకుపోయాయి. దీంతో పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయాయి. రాత్రంతా భారీ స్థాయిలో మంచు కురవడంతో వాహనాల్లో ఉన్న పర్యాటకులకు ఊపిరి ఆడక మృతి చెందారు. మొత్తం 22 పర్యాటకులు మృతిచెందారని.. వారిలో 9 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన ఇమ్రాన్ ప్రభుత్వం ముర్రేలో అత్యవసర పరిస్థితి విధించి.. సహాయక చర్యలు చేపట్టింది. మంచులో చిక్కుకున్న వాహనాలను బయటకు తీస్తున్నారు.

ముర్రేకు వెళ్లే అన్ని దారులను మూసివేసి.. సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. కాగా .. ఈ ఘటనలో ఇస్లామాబాద్‌కు చెందిన ఓ పోలీసు అధికారి నవీద్ ఇక్బాల్‌తోపాటు ఆయన కుటుంబ సబ్యులు కూడా మరణించినట్లు పేర్కొన్నారు. ఘటనపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/