మరోసారి ట్రంప్‌కే అధికార బదలాయింపు!
మద్దతు కోసం 7 దేశాల టూర్ ను ప్రకటించిన మైక్ పాంపియో!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ నేత జో బైడెన్ గెలిచిన విషయం తెలిసిందే. కానీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తన ఓటమిని అంగీకరించడం లేదు. ట్రంప్ కు మద్దతును కూడగట్టేందుకు అమెరికా విదేశాంగ మంత్రి 7 దేశాల పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జో బైడెన్ కు శుభాభినందనలు చెబుతూ యూరప్ దేశాధినేతలు కాల్ చేసిన నేపథ్యంలో, పాంపియో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అమెరికా ఎన్నికల ఫలితాల తర్వాత చాలా సున్నితమైన రీతిలోనూ అధికార బదలాయింపు ఉంటుందని ఆయన అన్నారు. అయితే ఆ బదలాయింపు.. మరోసారి ట్రంప్ పరిపాలనకే ఉంటుందని ఆయన తెలిపారు. బైడెన్ బృందంతో టచ్‌లో ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, పాంపియోశుక్రవారం నాడు పారిస్ కు బయలుదేరనున్నానని, అక్కడి నుంచి ఇస్తాంబుల్, జార్జియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ దేశాలకు వెళతానని స్పష్టం చేశారు. తన పర్యటనలో ట్రంప్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు, ఆయా దేశాలతో మిత్రత్వం, సహాయ సహకారాలను ప్రస్తావించనున్నట్టు పాంపియో మీడియాకు వెల్లడించారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/