కేంద్రానికి మమతా బెనర్జీ విజ్ఞప్తి

వలస కార్మికుల ఖాతాల్లో రూ. 10 వేలు జమ చేయండి

Mamata Banerjee
Mamata Banerjee

కోల్‌కతా: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యలోనే పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ ఒక్కో వలస కార్మికుడి ఖాతాలో రూ. 10 వేలు జమ చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. బుధవారం ట్విట్టర్‌ ద్వారా మమతా బెనర్జీ స్పందిస్తూ… లాక్‌డౌన్‌ సంక్షోభం కారణంగా ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాత్కాలిక ఉపశమన చర్యల్లో భాగంగా వలస కార్మికులకు, అసంఘటితరంగంలో పనిచేసే కార్మికులకు ఏకమొత్త సహాయంగా వారి అకౌంట్‌లో రూ. 10 వేలు జమ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇందుకుగాను పీఎం కేర్స్‌లో కొంత భాగాన్ని కేటాయించాల్సిందిగా ఆమె పేర్కొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/