ఏపీలో ఐదుగురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ

అమరావతి : ఏపీలో ఐదుగురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కోనసీమ జిల్లాలో చెలరేగిన హింసను ముందస్తుగా గుర్తించకపోవడంతో అక్కడ ఎస్పీగా పనిచేస్తున్నా ఎస్పీ సుబ్బారెడ్డిని బదిలీ చేశారు. అతడిని మంగళగిరి ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌గా నియమించారు. కోనసీమ కొత్త ఎస్పీగా సుధీర్‌కుమార్‌ రెడ్డిని, విజయవాడ శాంతి భద్రతల డీసీపీగా విశాల్ గున్ని, కృష్ణా జిల్లా ఎస్పీగా జాషువా, కర్నూలు ఎస్పీగా సిద్దార్ద్‌ కౌశల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/