వెనుకంజలో ప్రకాష్‌రాజ్‌, కన్హయ్య కుమార్‌లు

kanhaiya kumar, prakash raj
kanhaiya kumar, prakash raj

న్యూఢిల్లీ: ఈ సారి ఎన్నికల్లో మోది, రాహుల్‌..బిజెపి, కాంగ్రెస్‌..ఇతర పార్టీలతో పాటు ప్రముఖంగా ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దక్షిణ బెంగళూరు నుంచి స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌, బెగూసరా§్‌ు నుంచి సిపిఐ అభ్యర్ధిగా బరిలోకి దిగిన కన్హయ్య కుమార్‌లు ప్రముఖంగా బిజెపి వ్యతిరేకులు. వీరు మొదటి నుంచి మోది ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఎన్నికల బరిలోకి దిగారు. ఐతే ఈ రోజు జరుగుతున్న లెక్కింపులో ఇద్దరూ వెనుకంజలో ఉన్నారు. ప్రకాష్‌రాజ్‌పై బిజెపి అభ్యర్ధి తేజస్వి సూర్య భారీ ముందంజలో ఉన్నారు. ఇక బెగుసరా§్‌ులో కన్హయ్య కుమార్‌పై కేంద్ర మంత్రి, గిరిరాజ్‌ సింగ్‌ ముందంజలో ఉన్నారు.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/