రాజ్‌భవన్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా రాఘవేంద్ర సింగ్ చౌహాన్ రాజ్‌భవన్‌లో శనివారం ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా రాజ్బవన్ రోడ్డులో మోనప్ప ఐలాండ్ నుంచి వివి విగ్రహం జంక్షన్ వరకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమీషనర్ అనిల్‌కుమార్ తెలిపారు. చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారానికి చాలా మంది ప్రముఖులు హాజరవుతారని వివరించారు. ఈ సందర్భంగా ఈ రూట్లో వెళ్లే వాహనాలను మరో రూట్లోకి మళ్లించి, రాజ్‌భవన్ రూట్, పంజాగుట్ట, రాజ్‌భవన్ క్వార్టర్స్ రోడ్డును నిర్ణీత సమయానికి మూసివేస్తామన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:
https://www.vaartha.com/news/international-news/