శంషాబాద్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

 traffic
traffic

రంగారెడ్డి: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈరోజు తెలంగాణకు రానున్నారు. అయితే ఆయన సభ దృష్ట్యా శంషాబాద్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు. శంషాబాద్ మీదుగా కర్నూలు, బెంగళూరు వెళ్లే వాహనాల దారి మళ్లింపును చేపట్టారు. ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా శంషాబాద్ అవతల ఎన్‌హెచ్‌కు చేరుకోవాలని పోలీసులు సూచించారు. వాహనదారులు ఆరాంఘర్శంషాబాద్ మార్గంలోకి వెళ్లొద్దన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రాహుల్‌గాంధీ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మధ్యాహ్నం నుంచే పోలీసులు ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/