నేడు ఎల్బీ స్టేడియం వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు

traffic restrictions
traffic restrictions


హైదరాబాద్‌: ఎల్బీ స్టేడియంలో ఇవాళ జరగనున్న బిజెపి బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోది ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. దీంతో స్టేడియం పరిసరాల్లో సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నామని నగర పోలీస్‌ కమీషనర్‌ అంజనీ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నగర పౌరులు పోలీసు వారిక సహకరించాలని ఆయన కోరారు.
ట్రాఫిక్‌ ఆంక్షలు:
-ఏఆర్‌ పెట్రోల్‌ పంపు జంక్షన్‌ నుంచి బిజెఆర్‌ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి వైపు
-అబిడ్స్‌, గన్‌ఫౌండ్రి నుంచి వచ్చే వాహనాలను ఎస్‌బిఐ గన్‌ఫౌండ్రి నుంచి చాపేల్‌ రోడ్డులో అనుమతిస్తారు.
-బషీర్‌బాగ్‌ జంక్షన్‌ నుంచి జిపిఓకు వచ్చే వాహనాలను హైదర్‌గూడ, కింగ్‌ కోఠి మీదుగా
-పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్‌ జంక్షన్‌ వైపు

  • రాజమొహల్లా నుంచి వచ్చే వాహనాలను కింగ్‌ కోఠి, నారాయణగూడ వైపు
    -కింగ్‌ కోఠి నుంచి బషీర్‌బాగ్‌కు వచ్చే వాహనాలను భారతీయ విద్యాభవన్‌ వద్ద కింగ్‌కోఠి క్రాసు రోడ్డు తాజ్‌ బంజారా హోటల్‌ వైపు
    -అంబేద్కర్‌ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలను లిబర్టీ జంక్షన్‌ణుంచి హిమాయత్‌నగర్‌ రోడ్‌ వైపు
    -ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనాలను నాంపల్లి మార్గంలో పంపిస్తారు.
    -హిల్‌ ఫోర్టు నుంచి వచ్చే వాహనాలను బషీర్‌బాగ్‌ వైపు అనుమతించరు. ఆ వాహనాలను పిసిఆర్‌ జంక్షన్‌ నుంచి నాంపల్లి రోడ్డులో పంపిస్తారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/