కొవిడ్‌-19.. అధికారిని కల్చి చంపిన ఉత్తర కొరియా

కొవిడ్‌-19(కరోనా వైరస్) దేశంలోకి ప్రవేశించకుండా సైనిక చట్టాలు అమలు

kim jang un
kim jang un, north korea president

ఉ కొరియా: కొవిడ్‌-19 వైరస్‌(కరోనా వైరస్‌) చైనాతో పాటు చాలా దేశాలో వ్యాప్తి చెందుతుంది. ఈనేపథ్యంలో చైనా నుంచి వచ్చిన వారిని, చైనా ప్రజలను నిర్బంధించాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు జారీచేశారు. చైనాతో సరిహద్దులను మూసివేశారు. రోడ్డు మార్గాలు మూసివేయడమో లేక కఠిన నిషేధాలు అమలు చేయడమో అమలు చేస్తోంది. పర్యాటకులను నిషేధించింది. కొవిడ్‌-19 వైరస్ చాయలు తమదేశంలోకి రాకుడదన్న సంకల్పంతో దేశలో సైనిక చట్టాలను అమలు చేస్తోంది.

ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే.. చర్యలు ఎలా ఉంటాయన్నది తాజా ఘటనతో ప్రపంచానికి చాటింది. కొవిడ్‌-19 సోకిందన్న కారణంగా ఓ అధికారిని కాల్చివేసిందని.. పొరుగుదేశమైన దక్షిణ కోరియా మీడియా ఈ రోజు ఓ వార్తను ప్రచురించింది. అ అధికారి విధి నిర్వహణలో భాగంగా ఇటీవల చైనాకు వెళ్లి రావడంతో ఉత్తర కొరియా అధికారులు ఆ అధికారిని తొలుత నిర్బంధించారు. అయితే ఆ అధికారి ఓ పబ్లిక్ బాత్ రూంలో స్నానం చేయడానికి వెళుతున్న సమయంలో అధికారులు గుర్తించి కాల్చి వేశారని దక్షిణ కొరియా మీడియా కథనం. కాగా ఉత్తర కొరియాలో కొవిడ్‌-19 కేసు నమోదైనట్లుగా అధికారికంగా ఇప్పటివరకూ ప్రకటించలేదు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/