తుప్రాన్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయం
తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ

హైదరాబాద్: టిపిసిసి కార్యదర్శి బండారు శ్రీకాంత్ తుప్రాన్ మున్సిపాలిటీ ఇన్చార్జిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ సొంత నియోజవర్గంలో మున్సిపోల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తుప్రాన్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగానే సీఎం కెసిఆర్ సొంత నియోజవర్గంలో పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తుంది. దీనిలో భాగంగానే తుప్రాన్ బాధ్యతలను బండారు శ్రీకాంత్‌కు అలాగే గజ్వేల్ మున్సిపాలిటీకి టి. నర్సారెడ్డిని ఇన్‌చార్జ్‌లుగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియమించారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/