సీఎం కేసీఆర్ పై టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

revanth-reddy-response-on-sarpanch-shantamma-comments

టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై ఘాటు వ్యాఖ్యలు చేసారు. రెండేళ్ల క్రితం గ్రామంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు ఇప్పటిదాకా విడుదలకాలేదని నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఎరుగండ్లపల్లి సర్పంచ్ మాడెం శాంతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మర్రిగూడ ఎంపీడీవో కార్యాలయం వేదికగా జరిగిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమ సమీక్షలో తన గోడు వెళ్లబోసుకున్నారు.

గ్రామంలో చేసిన డెవలప్మెంట్ పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో తన పుస్తెలు అమ్మి వడ్డీ కట్టానని అధికారులను నిలదీసింది. బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారని అధికారులను నిలదీసింది. గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ కాలువలకు రూ. 25 లక్షలు ఖర్చు చేశామని.. ఇందులో రూ. 20 లక్షలు ప్రైవేటు వ్యక్తులను అప్పు తెచ్చినట్లుగా వారికి వడ్డీలు చెల్లిస్తున్నట్లుగా తన బాధను అధికారుల ముందు వ్యక్తం చేసింది.

ఈ ఘటనపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ..కేసీఆర్ ఫై ఘాటు వ్యాఖ్యలు చేసారు. ‘ఆడబిడ్డలకు పుస్తెల తాడు ప్రాణ సమానం అని.. ఊరికి ఉపకారం చేసినందుకు ఆ తాళినే అమ్మి వడ్డీలు కట్టాల్సిన దుస్థితిని కల్పించిన దౌర్భాగ్యుడు కేసీఆర్ అని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో పల్లెల దుర్గతికి నిదర్శనం శాంతమ్మ దీనగాథ’ అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.