తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి విమర్శలు

కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు..రేవంత్ రెడ్డి

హైదరాబాద్: వరి కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ రైతులను మోసం చేస్తున్నాయని టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచుతున్నాయని మండిపడ్డారు. పంట అమ్ముకోలేక రైతులు ప్రాణాలు వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీతో జరిగిన చీకటి ఒప్పందంలో భాగంగానే రైతు చట్టాల రద్దుపై.. చర్చ జరగకుండా టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో అడ్డుకున్నారని విమర్శించారు.

కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం కనీసం ప్రత్యామ్నాయ పంటల విధానాన్ని కూడా ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కేసీఆర్ మెడపై కత్తి పెడితే.. ఆస్తులు, పదవులు మోడీకి రాసిస్తారా?అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని.. కేంద్రం చెప్పినందుకే కేసీఆర్ రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారా? అని నిలదీశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/