రాజగోపాల్‌ రెడ్డి మద్దతుదారులఫై చర్యలు తీసుకున్న టీపీసీసీ

TPCC has taken action against the supporters of Rajagopal Reddy

Community-verified icon


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు అంశం ఇప్పుడు చర్చగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత , మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన పదవికి , కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. రాజగోపాల్ రాజీనామా తో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. త్వరలోనే రాజగోపాల్ బిజెపి లో చేరబోతున్నాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరోపక్క రాజగోపాల్ రాజీనామా ఫై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యింది. వరుసగా నేతలు రాజగోపాల్ ఫై విమర్శలు చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే కాదు తాజాగా రాజగోపాల్‌ రెడ్డి మద్దతుదారులపై చర్యలు తీసుకుంది పార్టీ.

రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఉన్న నాలుగు మండలాల అధ్యక్షులు, ఓ టౌన్‌ అధ్యక్షుడిపై వేటు వేసింది. టీపీసీసీ ఆదేశాల మేరకు రాజగోపాల్‌ రెడ్డి మద్దతుదారులను తొలగించినట్లు వెల్లడించారు డీసీసీ అధ్యక్షుడు. చర్యలు తీసుకున్న వారిలో మునుగోడు- పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, చండూరు- పల్లె వెంకన్న, నాంపల్లి- పూల వెంకటయ్య, మర్రిగూడ- రాందాస్ శ్రీనివాస్ సహా ఓ టౌన్‌ అధ‍్యక్షుడున్నారు. ముందుగా ఆరుగురు మండలాధ్యక్షులపై చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. చౌటుప్పల్- మోదుగుల రమేష్, సంస్థాన్ నారాయణ పురం- కరెంట్ శ్రీనివాస్‌లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉంటె రేవంత్ రెడ్డి రాజగోపాల్ ఫై చేస్తున్న వ్యాఖ్యలపై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.