తిడుతున్నా ఎవరూ పట్టించుకోరా?

పార్టీ నేతలపై ఉత్తమ్‌ అసంతృప్తి

Uttam Kumar Reddy
Uttam Kumar Reddy

హైదరాబాద్‌: సొంత పార్టీ నేతలపై కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఉత్తమ్‌ను విమర్శించిన విషయం తెలిసిందే. నేతలపై అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. పిసీసీ చీఫ్‌ను విమర్శిస్తే తిరిగి ఒక్కరు కూడా ప్రశ్నించలేదని వాపోయారు. ఎందుకు ఎదురు దాడికి ఏ ఒక్కరైనా దిగలేదని ఆయన అడిగారట. అయితే ఉత్తమ్‌ వ్యాఖ్యలపై స్పందించిన సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ కలజేసుకుని ఎవరో ఒక్కరైనా స్పందించాల్సింది కదా అని అన్నారు. ఎమ్మెల్యెగా ఉన్న సమయంలో పార్టీపై పట్టు ఉండేదని, ఎంపీగా గెలిచిన తర్వాత ఢిల్లీ వెళ్లిన మూలంగా పార్టీపై పట్టు పోయిందని, ఈ నేపథ్యంలోనే ఉత్తమ్‌ ఈ విధమైన వ్యాఖ్యలు చేసినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/