మొదటి రోజు టాస్‌ చాలా ముఖ్యమైనది

టీమిండియా ఓటమిపై స్పందించిన కోహ్లీ

Virat Kohli
Virat Kohli

వెల్లింగ్టన్‌: భారత్‎తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ‘మొదటి రోజు టాస్ చాలా ముఖ్యమైనది. పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న మేము ఈ మ్యాచ్‌లో పోటీ ఇవ్వలేకపోయాం. కివీస్ బౌలర్లు ఇంతలా ఒత్తిడికి గురిచేస్తారనుకోలేదు. మేం 220-230 స్కోర్‌ చేసినా సరిపోయేది కాదు. తొలి ఇన్నింగ్స్‌లో చేసిన తక్కువ పరుగులే మ్యాచ్‌లో మేం వెనుకపడేలా చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ ఆధిక్యాన్ని 100లోపే కట్టడి చేయాలనుకున్నాం. కానీ.. చివరి మూడు వికెట్లు తీయడంలో బౌలర్లు విఫలమయ్యారు’ అని అన్నాడు. ‘మా బౌలర్లు రాణించేందుకు కివీస్ ముందు పెద్ద స్కోర్‌ ఉంచాల్సింది కానీ.. ఈ మ్యాచ్‌లో మేం అదే చేయలేకపోయాం. 7 వికెట్లు వరకు బౌలర్లు బాగా రాణించారు. చివరి 3 వికెట్లు చేసిన 120 పరుగులు మమ్మల్ని ఆట నుండి దూరం చేసాయి. బాగా ప్రయత్నం చేసాం కానీ.. కుదరలేదు. ఇంకా క్రమశిక్షణతో ఆడాల్సి ఉంది. బౌలర్లను నిందించాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ స్థాయిలో ఒక్కోసారి ఇలా జరుగుతుంది’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/