మోస్ట్ ట్వీటెడ్ ఇండియన్ సినిమాల్లో టాప్ 3

సోషల్ మీడియా రివైండ్

Mahesh babu
Mahesh babu

2020 సంవత్సరాన్ని మాత్రం ఏ ఒక్కరూ కూడా అంత సులభంగా మర్చిపోలేరు. కరోనాతో ప్రపంచం అంతా గడగడలాడగా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా కరోనా చాలదు అన్నట్టుగా మరిన్ని సమస్యలు తోడయ్యాయి .  

ఈ ఏడాది పూర్తి కావస్తుండడంతో ఏడాదిని ఓసారి సోషల్ మీడియా రివైండ్ చేస్తుంది.

ఇప్పుడు ట్విట్టర్ పలు క్యాటగిరిలలో అత్యధికంగా ట్విట్టర్ లో చర్చించుకున్న అంశాలను వెల్లడిస్తున్నారు.

వాటిలో మన దేశంలోనే అత్యధికంగా మాట్లాడుకున్న సినిమాల జాబితాలో మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం “సరిలేరు నీకెవ్వరు” టాప్ 3లో నిలిచింది.

ఈ లిస్ట్ ను వీరు విడుదల కాబడిన ఇండియన్ సినిమాల ఆధారంగా తీసుకోగా అందులో ఏకైక తెలుగు సినిమాగా మహేష్ నటించిన ఈ చిత్రం నిలిచింది.

ఇక ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/