ప్రతిపాదన చూసి ఆలోచించి స్పందిచాలి

లేదంటే తొందరపాటు అవుతుంది: గంగూలీ

Sourav Ganguly
Sourav Ganguly

కోల్‌కతా: ఐదు రోజుల టెస్టుల్ని కుదించే అంశంపై బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందిచారు. మొదట వారి ప్రతిపాదన చూడాలి. ఆ తర్వాత దానిపై మనం ఆలోచించాలి. ఇప్పుడే దాని గురించి స్పందిస్తే అది తొందరపాటు అవుతుంది. అని దాదా అన్నారు. అయితే అయిదు రోజుల టెస్టుల్ని నాలుగు రోజులకు కుదించే ఆలోచనలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నది తెలిసిన విషయమే. కాగా ఈ నేపథ్యంలో దాదా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే 2023లో ముగియనున్న ప్రస్తుత భవిష్యత్‌ పర్యటనల ప్రణాళిక అనంతరం నాలుగు రోజుల మ్యాచ్‌లు అమలు లోకి వచ్చే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 2017లో సౌతాఫ్రికా-జింబాబ్వే, 2019లో ఇంగ్లాండ్‌-ఐర్లాండ్‌ మధ్య నాలుగు రోజుల టెస్టులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/