రేపటి బడ్జెట్‌ దేశ దిక్సూచి

సామాన్యుల వినియోగ అవసరాలకు సరిపడా డబ్బులులేకనే దేశంలో గతంలో ఎన్నడూలేనంతగా దాదాపు మూడుశాతం వినియోగం పడిపోయింది. వినియోగమే లేనప్పుడు పరిశ్రమలు ఎంతగా ఉత్పత్తి చేసినా కొనేవారేవరు ఉండరు. కొనేవారు లేనప్పుడు, ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తిని తగ్గించుకోవడంతో ఉపాధి అవకాశాలు కూడా కొరవడతాయి. ముందుగా సామాన్య ప్రజలతోపాటు వేతన జీవ్ఞల కనీస అవసరాలకు సరిపడే వినియోగానికి సరిపడే నగదు లభించేటట్లుగా, వారి ఆదాయాలు జరిగేటట్లుగా బడ్జెట్‌ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Budget

దేశ ప్రజలు మరో బడ్జెట్‌ను చూడబోతున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరకాలంలో ప్రవేశపెడుతున్న రెండవ బడ్జెట్‌. భారతదేశ ఆర్థిక రంగాన్ని ఎటువైపు నడుపుతుందో అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తు న్నారు. గత జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ దేశ ఉత్పత్తి, సేవా వర్గాలతోపాటు అన్ని రంగాల్లో నిరాశను, నిస్తేజాన్ని నింపడమే కాకుండా, దేశ ఆర్థిక వృద్ధిని దశాబ్దాల వెనక్కి నెట్టిందనే విమర్శల నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటవ తేదీన, మొదటి ఆర్థిక మహిళా మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెడుతున్న రెండవ బడ్జెట్‌ దేశ ఆర్థికరంగాన్ని గాడిలో పెట్టేదిగా ఉండాలని, పారిశ్రామికవేత్తలకే కాకుండా యువతకు ఉపాధి కల్పించే దిశలో నూతన ఉత్తేజాన్ని నింపేదిగా ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు.

ఇటీవల జరుగు తున్న పరిణామాలు మాత్రం అందుకు ఏమాత్రం బలం చేకూర్చ డంలేదు. పారిశ్రామికవేత్తలతో కానీ ఇతర ప్రభావిత రంగాల ప్రముఖులతో ప్రధాని జరిపిన సమావేశాల్లో ఆర్థికమంత్రి కనబడక పోవడం వింతగా ఉంది. ఇదిలా ఉండగా గతంలో మనదేశంలో పెట్టుబడులు పెట్టిన విదేశీయులలో 75శాతం తమ పెట్టుబడుల విషయంలో ఊగిసలాటధోరణిలో ఉన్నట్లు తెలుస్తుంది. దేశ ఆర్థిక విధానం ఏమిటో, ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసు కుంటుందోననే సందేశాలతో భారతదేశంలో అవకాశాలున్నా విదేశీ యులు తమ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదు.

అదికాకుండా గతంలో షేర్‌ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులలో కూడా 80శాతం వరకు గతంలోనే వెనక్కి తీసుకున్నారు. విదేశీ మదుపరులను ఆకర్షించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందనే అన్నివర్గాల ఆర్థికవేత్తలు ఆరోపిస్తున్నారు. ద్రవ్యలోటు ను కట్టడి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం తన ఖర్చులను తగ్గించు కొన్నట్లు కనబడుతున్నా తగ్గిన ప్రభుత్వ ఆదాయ వనరుల వల్ల గత నవంబర్‌ నాటికే ప్రభుత్వ లక్ష్యమైన 3.3 ద్రవ్యలోటు పరి మితి దాటిపోయిందని, ఈ ఆర్థికసంవత్సరాంతానికి ద్రవ్యలోటు ఆరు నుండి ఏడు శాతానికి చేరవచ్చునని ఆర్థిక నిపుణులఅంచనా. ద్రవ్యలోటు తగ్గించుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ఖర్చులను, తెస్తున్న అప్పులను దొడ్డిదారిన ప్రభుత్వ బడ్జెట్‌ లెక్కలలోకి రాని కార్పొరేషన్ల పేరున అప్పు చేస్తుంది.దీనివల్ల ప్రభుత్వ నికర అప్పు ల మొత్తంలో తగ్గుదల కనిపిస్తుంది.

కానీ ప్రభుత్వ సంస్థలైన ఇతర కార్పొరేషన్లు తీసుకొంటున్న అప్పులకు ప్రభుత్వమే పూచీకత్తులను ఇస్తుంది. అంటే కార్పొరేషన్‌ ఆ అప్పులను చెల్లించలేనప్పుడు ప్రభుత్వమే ఆ అప్పును చెల్లిస్తుంది. కానీ ఇలా కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థల పేర ప్రభుత్వం విడుదల చేసే అప్పు బాండ్లు ఏవీ కూడా బడ్జెట్‌ లెక్కలలో చూపించరు. అలాగే ప్రభుత్వం బ్యాంకులలోని నిరర్థక ఆస్తులను తగ్గించుకోవడానికి, తిరిగి బ్యాంకులు సక్రమంగా నవడానికి అవసరమైన మూలధన నిధులను కల్పించడంలో ప్రభుత్వం ఇస్తున్న నిధులతోపాటు,

బ్యాంకులకు తిరిగి మూలధన కల్పనకై విడుదల చేస్తున్న రిక్యాపిటలైజేషన్‌ బాండ్లతో కూడా ప్రభుత్వంపై ప్రచ్ఛన్నభారం పడుతుంది. కానీ ఇవేవీ కూడా ద్రవ్యలోటును చూపించవ్ఞ. దేశ ఆర్థికరంగం కుదేలవడానికి ప్రభుత్వ విధానాలు, అనాలోచిత నిర్ణయాలు కారణం కావని, ప్రపంచంలోని ఇతర దేశాలలో నెలకొన్న మందగమన పరిస్థితుల వల్లనే భారత ఆర్థిక ప్రగతి కూడా మందగించిందని ప్రభుత్వ పెద్దలు చెపుతున్నారు.

కానీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులే విదేశీయులు భారతదేశంలో పెడుతున్న పెట్టుబడులు లాభాల కోసమే కానీ, మనకు లాభం చేయడానికికాదని విమర్శించడంలోని ఔచిత్యాన్ని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. మొన్న ప్రభుత్వ ప్రమేయంతో జరిగిన సదస్సులో వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ ‘అమెజాన్‌ సంస్థ పెడుతున్న బిలియన్ల పెట్టుబడులు భారతదేశానికి చేస్తున్న మిగులుగా చూడకూడదని అనడం వింతగా తోచింది.

అమెజాన్‌ అధినేత జెఫ్‌బ్రేజో భారతదేశ పర్యటనలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రకటనలను ఒక మంత్రి చేయడం, అంతకు వారం ముందే అమెజాన్‌, ఫ్లిప్కార్డ్‌ సంస్థలపై కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా దర్యాప్తులు ప్రారంభించడం పారిశ్రామికవేత్తలను, ముఖ్యంగా విదేశీయులను ఆశ్చర్యపరచడమేకాకుండా భారతదేశం విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తుందా లేక వారిని వెళ్లగొట్టాలనుకొం టుందా అనే సందేహాన్ని వెల్లబుచ్చుతున్నారు. దేశ ఆర్థికరంగా భివృద్ధి కుదేలై, యువత ఉద్యోగాలు లేక అల్లాడుతుంటే, పెట్టుబ డులు పెట్టి, ఉపాధి కల్పన చేస్తామంటున్న కంపెనీలను బెంబేలె త్తించడం ఎందుకో అర్థం కాక ఆర్థిక నిపుణులు తలలు పట్టుకుం టున్నారు.

ముఖ్యంగా రిలయన్స్‌ సంస్థ కామర్స్‌ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించిన తరువాత నుండే ప్రభుత్వం అమెజాన్‌, ఫ్లిప్కార్డ్‌ సంస్థలు చట్టాలకు వ్యతిరేకంగా, లేదా చట్టా లలోని లొసుగులను ఆధారం చేసుకొని వ్యాపారం చేస్తున్నాయనే మాటలు ప్రభుత్వవర్గాల నుండి వినబడుతున్నాయి. ఆర్థికరంగాన్ని అర్థంచేసుకొని యువతకు ఉపాధి కల్పనకు ఊతమిచ్చే పారిశ్రామిక విధానాలతోపాటు వ్యవసాయరంగంలో వృద్ధినినమోదుచేయించగల ప్రణాళికలు రూపొందించే వినూత్న బడ్జెట్‌ రూపకల్పన చేయగల సమర్థులు కావాలి.

కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆర్థికరంగంపై, ముఖ్యంగా స్థూల ఆర్థిక రంగాన్ని అర్థం చేసుకోగల నాయకులే లేరని, అందుకే తమ రాజకీయ అవసరాల కోసం, ఆలోచనలేని ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలతో ప్రభుత్వం దేశాన్ని భ్రష్టుపట్టి స్తుంది. గత బడ్జెట్లో ఉన్నత వర్గాల పేర,అధిక లాభాలు ఆర్జించే వారికి,విదేశీ పెట్టుబడిదారులపై అధిక పన్నులు వేసి, తిరిగి రద్దు చేయడం, పారిశ్రామిక ప్రగతి కొరవడిందని, దాదాపు 1400 కోట్ల మేర పన్ను రాయితీ ప్రక టించడం లాంటి తిరోగమన చర్యలే మళ్లీ ఈసారి కూడా ఉంటాయేమోనని పారిశ్రామికవర్గాలతోపాటు అన్నివర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సామాన్యుల విని యోగ అవసరాలకుసరిపడా డబ్బులులేకనే దేశంలో గతంలో ఎన్న డూలేనంతగా దాదాపు మూడుశాతం వినియోగం పడిపోయింది. వినియోగమే లేనప్పుడు పరిశ్రమలు ఎంతగాఉత్పత్తి చేసినా కొనే వారేవరు ఉండరు. కొనే వారు లేనప్పుడు, ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తిని తగ్గించుకోవడంతో ఉపాధి అవకాశాలు కూడా కొరవడ తాయి.

ముందుగాసామాన్య ప్రజలతోపాటు వేతన జీవ్ఞల కనీస అవసరాలకు సరిపడే వినియోగానికి సరిపడే నగదులభించేటట్లుగా, వారి ఆదాయాలు జరిగేటట్లుగా బడ్జెట్‌ ఉండాలని ప్రజలు కోరు కుంటున్నారు. ఉద్యోగస్తులు,చిన్న,చిల్లర వ్యాపారులు ఆర్జించే ఆదా యంపై చెల్లించే ఆదాయ పన్నుశాతం మొత్తంరాబడిలోరెండుశాతం కూడా లేనందున వీరి ఆదాయం పరిమితి పెంచడంవల్ల ప్రభుత్వ రాబడికి జరిగే నష్టం ఏమీ ఉండదని నిపుణులు అంచనా వేస్తు న్నారు.అలాగే వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు తోడ్పడే ప్రణా ళికలు, యంత్రాల సబ్సిడీపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి.

సి.హెచ్‌.వి.ప్రభాకర్‌రావు, (రచయిత: సీనియర్‌ జర్నలిస్టు

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/