రేపు ఛలో అమలాపురం చేపడతాం

ఆలయాలపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

Somu veerraju

అమరావతి: ఏపిలో హిందూ దేవాలయాలపై జరుగుతున్నా దాడులపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. దాడులకు గురైన ఆలయాల సందర్శనకు వెళ్లిన యువకులపై కేసులు పెట్టడం దారుణమని అన్నారు. ప్రభుత్వ ఆగడాలను నిరసిస్తూ రేపు ఛలో అమలాపురం కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామని చెప్పారు. ఛలో అమలాపురం కార్యక్రమాన్ని తాను ఇప్పటి వరకు ప్రకటించనప్పటికీ… వాలంటీర్ల ద్వారా గ్రామాల్లోని బిజెపి నేతలు, కార్యకర్తల వివరాలను ప్రభుత్వం ఎందుకు సేకరిస్తోందని ప్రశ్నించారు. దేవాలయాలను పరిరక్షించడంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయని చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/