రేపు పాలిటెక్నిక్‌ పరీక్ష

polycet-2019-exam
polycet-2019-exam

హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ కళాశాల 2019-20 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబందించి మంగళవారం(రేపే) జరిగే పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాటుల చేశారు. అయితే పరీక్ష ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి గంటముందే అనుమతి ఉంటుందని, విద్యార్థులు హాల్‌టిక్కెట్లు, హెచ్‌బీ పెన్సిల్‌, పెన్ను వెంట తెచ్చుకోవాలన్నారు. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతి ఉండదని పేర్కొన్నారు. తొలిసారిగా విద్యార్థుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన యాప్‌ ద్వారా ఇందుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చని సువర్ణలత తెలిపారు. పరీక్షలకు 5గురు అబ్జర్వర్లతో పాటు ప్రత్యేక అబ్జర్వర్‌, 15 మంది ఇన్విజిలేటర్ల నియమించినట్లు పేర్కొన్నారు.


మరిన్ని కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/