రేపు 12 గంటల నిరసన దీక్ష

రేపు 12 గంటల నిరసన దీక్ష
Chandra babu naidu

Amaravati: భవన నిర్మాణ కార్మికుల్లో భరోసా పెంచేందుకే దీక్ష చేపడుతున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇసుక కృత్రిమ కొరతను వైకాపా నేతలే సృష్టించారన్నారు. ఇసుక మాఫియాగా ఏర్పడి దోపిడీ చేస్తున్నారన్నారు. కార్మికులకు సంఘీభావంగా ర్యాలీలు జరపాలన్నారు. అమరావతిలో స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ నిలిపివేశారన్నారు. సింగపూర్ కన్సార్షియంతో ఎంవోూ రద్దు చేశారన్నారు. ఇది ఏపీ అభివృద్ధికి ఊహించని శరాఘాతమన్నారు. రాష్ట్రానికి ఎక్కడా పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదన్నారు.

రేపు చేపట్టబోయే 12 గంటల నిరసన దీక్షలో అన్నివర్గాల ప్రజలు పాల్గొనాలని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తక్షణమే ఇసుక ఉచితంగా ఇవ్వాలన్నారు. సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం చేయాలన్నారు. పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. పనులు కోల్పోయిన వారికి నెలకు రూ.10వేలు పరిహారం ఇవ్వాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.25లక్షలు పరిహారం చెల్లించాలన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/