రేపు పాలమూరులో కెసిఆర్‌ పర్యటన

kcr
kcr

హైదరాబాద్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌ రేపు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఇటీవల సమీక్ష సందర్బంగా ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను కెసిఆర్ ఆదేశించారు. ఎంత మేరకు పనులు జరిగాయన్న విషయాన్ని సిఎం స్వయంగా పరిశీలించనున్నారు. రేపు ఉదయం 9గంటలకు హెలికాప్టర్ ద్వారా కరివెన వెళ్లనున్న సిఎం పట్టెం, నార్లపూర్, ఏదుల జలాశయాలను పరిశీలిస్తారు. పనుల పురోగతిపై అధికారులతో సిఎం సమీక్షించనున్నారు. పాలమూరురంగారెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్ పనులపై ఆరా తీయనున్నారు. ఇప్పటికే సిఎం కెసిఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/