టమోటా మిక్స్‌డ్‌ మసాలా

టమోటా మిక్స్‌డ్‌ మసాలా
Tomato mixed Masala curry

కావలసిన పదార్థాలు
హైబ్రీడ్‌ టమాటాలే – 1/4 కిలో
నువ్ఞ్వ పప్పు – 50 గ్రాములు
వేరుశెనగపప్పు – 50 గ్రాములు
గరం మసాలా – 1 స్పూన్‌
పచ్చిమిర్చి – 2
అల్లం, వెల్లుల్లి ముద్ద – 1 స్పూన్‌
ఉల్లిపాయలు – 5
కొబ్బరి తురుము -1/2 కప్పు
గసగసాలు – 2 స్పూన్లు
మినప్పప్పు – 1 స్పూన్‌
జీలకర్ర – 1/4 స్పూన్‌
ఆవాలు- 1/2 స్పూన్‌
కరివేపాకు, ఉప్పు
కొత్తిమీర – సరిపడినంత
కారం – స్పూన్లు
నూనె – 1 గరిటె
తయారుచేయు విధానం:
నువ్ఞ్వపప్పు, వేరుశనగపప్పు, గసగసాలు విడివిడిగా వేగించాలి.
నువ్ఞ్వపప్పు, వేరుశనగపప్పు, గసగసాలు, గరం మసాలా, అల్లం, వెల్లుల్లి ముద్ద, ఉప్పు అన్ని కలిపి ముద్దగా నూరాలి.
ఆ ముద్దకు కొబ్బరి తురుము కలిపి, టమాటాలపై భాగంలో అడ్డంగా తరిగి మూతలు తీసి రసం గిన్నెలోకి తీసి నూరిన ముద్దను టమాటాల్లో నింపి మూతలు పెట్టి, మిగిలిన మసాలా పక్కన ఉంచాలి.
మందపాటి పాత్ర స్టౌ మీద పెట్టి నూనె మరిగాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేయించి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి సన్నని సెగలో వేయించాలి.
తరువాత పసుపు, కారం, ఉప్పు వేసి రెండు నిమిషాల తరువాత వంచిన టమాటా రసం మిగిలిన మసాలా వేసి కలియబెట్టి మనకు కావలసినంత నీరు వేయాలి. పులుసు సగం ఉడికిన తరువాత టమాటాలు జాగ్రత్తగా పులుసులో వేసి సిమ్‌లో 20 నిమిషాలు మగ్గనిచ్చి దించాలి.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి : https://epaper.vaartha.com