టామ్‌ హాంక్స్‌ దంపతులకు సోకిన కరోనా

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న టామ్…జలుబు, ఒళ్లు నొప్పులు రావడంతో పరీక్షలు

Tom Hanks, Rita Wilson test positive for coronavirus
Tom Hanks, Rita Wilson test positive for coronavirus

ఆస్ట్రేలియా: కరోనా మహమ్మారి ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్, అతని భార్య రీటా విల్సన్ లకు సోకింది. ఈ విషయాన్ని టామ్ హాంక్స్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. వీరిద్దరి వయసూ 63 సంవత్సరాలు కాగా, ఇద్దరూ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం తాము ఐసోలేషన్ వార్డులో ఉన్నామని, వైద్యులు చికిత్సను అందిస్తున్నారని టామ్ హాంక్స్ తెలిపారు. ‘కాస్తంత అలసినట్టు అనిపించింది. ఒళ్లు నొప్పులు, జలుబు వచ్చాయి. రీటా పరిస్థితి కూడా ఇంతే. ఆమెకు కాస్తంత జ్వరం కూడా ఉంది. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యే మా ముందుంది. మేము కరోనా పాజిటివ్ అయ్యాము’ అని టామ్ తెలిపారు. ప్రస్తుతం అన్ని రకాల మెడికల్ ప్రొటోకాల్స్ పాటిస్తున్నామని అన్నారు. కాగా, టామ్ హాంక్స్ పలు హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/